ఫేక్ పట్టాలతో భూములను కబ్జా చేశారు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

by Kema Shiva Kumar |

గాజులరామారం (Gajula Ramaram)లో పరిధిలోని సర్వే నెంబర్ 302లో ఫేక్ పట్టాలతో భూములను యథేచ్ఛగా కబ్జా చేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) అన్నారు.

ఫేక్ పట్టాలతో భూములను కబ్జా చేశారు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: గాజులరామారం (Gajula Ramaram)లో పరిధిలోని సర్వే నెంబర్ 302లో ఫేక్ పట్టాలతో భూములను యథేచ్ఛగా కబ్జా చేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గాజులరామారం పరిధిలోని దేవేందర్ నగర్, బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీల్లో భూములు కబ్జా చేసిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారని తెలిపారు. వారు 200 నుంచి 300 గజాల భూమిని కబ్జా చేసి.. ఆ స్థలంలోనే ఓ రూం కట్టి, కరెంట్ కనెక్షన్లు తీసుకుని అక్కడ నివాసం ఉండేలా నిరుపేదలకు తిరిగి రూ.2 వేలు ఇస్తూ రెంట్‌ ఉండేలా చేస్తూ ఫేక్ డాక్యుమెంట్లతో అమ్మకం చేస్తున్నారని అన్నారు. 900లకు పైగా అక్రమ కట్టాడాలను గుర్తించామని, 640 ఇళ్లలో ఉన్న ఏ ఒక్కరిని తాము తాకలేదని స్పష్టం చేశారు.

నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు కరెంట్ కనెక్షన్ లేని వాటిని మాత్రమే కూల్చేశామని తెలిపారు. ప్లాట్లు కొన్న వారు అమ్మిన వారి పేర్లను బయటకు చెప్పాలన్నారు. కబ్జాకు గురైన భూమి 300 ఎకరాలకు పైగా ఉంటుందని.. దాని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.15 వేల కోట్లకు పైనే ఉంటుందని పేర్కొన్నారు. దొంగ ఓర్సీలతో ఈ తంతంగం అంతా జరిగిందని తెలిపారు. గాజులరామరంలో ఇళ్ల కూల్చివేతపై సోషల్ మీడియాలో ఎవరి లైన్ వారు తీసుకుంటున్నారని.. ఆ విషయంలో తాను మాట్లాడబోనని అన్నారు. ప్రజలకు నిజాలను గమనించాలని.. హైడ్రాపై సోషల్ మీడియాలో చేస్తు్న్న దుష్ప్రచారన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం కష్టతరమైన పని అని.. అంత ఈజీ కాదన్నారు. చెరువుల

Next Story