- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో ఏటా లక్షల మందికి పక్షవాతం.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
వైద్యం, వైద్య సేవలు ఒక 'మిషన్'లా సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైద్యం, వైద్య సేవలు ఒక 'మిషన్'లా సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్, ఎల్.బి. నగర్‌లో వెల్‍నాక్స్ (Wellknox) రీహాబిలిటేషన్ నాలుగో కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొని, వైద్య నిపుణులతో ముచ్చటించారు. రీహాబిలిటేషన్ అనే ముఖ్యమైన సామాజిక అవసరాన్ని గుర్తించి, రోబోటిక్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని డాక్టర్ స్వాతి ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు.
వైద్యం, వైద్య సేవలు ఒక 'మిషన్'లా సాగాలని, సర్జరీ తర్వాత రోగి తన సొంత కాళ్లపై నిలబడేలా చేసే 'గోల్డెన్ విండో' పీరియడ్‌లో రీహాబిలిటేషన్ పాత్ర కీలకం అని చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తూ దేశంలో ఏటా లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్న తరుణంలో, ఇలాంటి అత్యాధునిక కేంద్రాలు మరిన్ని రావాలని కీలక వ్యాఖ్యలు చేశారు. బీమా సంస్థలు కూడా రీహాబిలిటేషన్‌ను పూర్తిస్థాయిలో బీమా పరిధిలోకి తీసుకువచ్చి రోగులకు అండగా నిలవాలని ఆయన కోరారు.






