హైదరాబాద్‌లో అదిరిపోయే లేక్ ఫ్రంట్ పార్క్.. KTR ట్వీట్ (వీడియో)

by Disha Web Desk 4 |
హైదరాబాద్‌లో అదిరిపోయే లేక్ ఫ్రంట్ పార్క్.. KTR ట్వీట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అదిరిపోయే లేక్ ఫ్రంట్ పార్క్ పర్యాటకుల కోసం రెడీ అయింది. హుస్సేన్ సాగర్‌పై బోర్డు వాక్ నిర్మాణం ద్వారా పర్యాటకులు హైదరాబాద్ అందాలను సరికొత్తగా చూసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హైదరాబాద్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచేలా హుస్సేన్ సాగర్ జలవిహార్ దగ్గరలో లేక్ ఫ్రంట్ పార్క్‌ను ప్రతిష్టాత్మకంగా హెచ్ఎండీఏ తీర్చిదిద్దింది. లేక్ ఫ్రంట్‌పైకి వెళ్లేలా ఓ వంతెన నిర్మించారు. అక్కడి నుంచి హైదరాబాద్ అందాలను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే నిర్మాణానికి సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్ ఓ వీడియో షేర్ చేశారు. ‘హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ లేక్ పరిసర ప్రాంతాల్లో మరో అద్భుతమైన నిర్మాణం రెడీ అయింది. జలవిహార్ వద్ద లేక్ ఫ్రంట్ పార్క్‌ను పది ఎకరాల్లో హెచ్ఎండీఏ అద్భుతంగా తీర్చిదిద్దింది. త్వరలోనే ఈ పార్క్ ను ప్రారంభించనున్నాం. ప్రజలంతా ఈ బోర్డ్ వాక్‌ను ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను.’ అని ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed