లేడీ ఐఏఎస్‍కు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వేధింపులు.. పోలీసుల వద్దకు పంచాయతీ

by Prasad Jukanti |   (  Updated:2026-04-15 07:43:05  IST  )

అసభ్యకర రీతిలో వ్యవహరించడంతో పాటు తన ఇంటి వద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్‍పై మహిళా ఐఏఎస్ ఫిర్యాదు చేశారు.

లేడీ ఐఏఎస్‍కు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వేధింపులు.. పోలీసుల వద్దకు పంచాయతీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి ఐఎఫ్ఎస్ అధికారి వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. తన ఇంటివద్దకు వచ్చి లైంగికపరమైన అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఈ మేరకు ఇండియన్ టెలికామ్ సర్వీస్ లో డైరెక్టర్‍గా పని చేస్తున్న నితికా సింగ్ (Nitika Singh IAS) అనే మహిళా ఐఏఎస్ ఆఫీసర్.. సుతాన్ అనే ఐఎఫ్ఎస్ (Sudhan IFS) అధికారిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న బాధితురాలు.. ఈ సందర్భంగా పలు వీడియోలను ఆధారాలుగా ఫిర్యాదులో జతపరిచారు. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6:40 గంటలకు నా డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చానని, నా ఎదురింట్లో ఉండే సుధన్ ఎస్.పి నా స్టాఫ్‌ను,నా కుక్కను దూషించాడని అంతడితో ఆగకుండా ఇంటి తలుపులు బలంగా కొట్టి నా పూల కుండీలు ధ్వంసం చేశాడని ఫిర్యాదులో నితికా సింగ్ పేర్కొంది.

సిగరేట్ తాగుదాం రా..

నీకు తెలుసా నాకు హిందీ వచ్చు. సిగరేట్ తాగుదాం అని అభ్యంతరక మాటలు సుతాన్ మాట్లాడాడని నా తలుపు దగ్గరకు వచ్చి నువ్వు నితికా సింగ్ కదా.. రా అంటూ లైంగిక పరమైన కామెంట్స్ చేశారని వాటినే పదే పదే రిపీట్ చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. నితికా సింగ్ ఫిర్యాదు మేరకు సుతన్‌పై BNS 75, 79, 324(4), 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు




Next Story