- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: లేడీ డాన్, గంజాయి వ్యాపారి అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు
గంజాయి వ్యాపారి అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు అయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గంజాయి వ్యాపారి అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు అయింది. గంజాయి అక్రమ వ్యాపారిపై నమోదైన పీడీ యాక్ట్ కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌ను హై కోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దూల్‌పేట ప్రాంతానికి చెందిన గంజాయి వ్యాపారి, లేడీ డాన్ అరుణ్ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్ పై 2025లో ఎప్రిల్ నెలలో పీడీ యాక్ట్ నమోదు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు మౌసమీ భట్టాచార్య, గాడి ప్రవీణ్ కుమార్ విచారణ జరిపారు. వాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ మంగళవారం తీర్పును వెలువరించారు. అంగూరి బాయ్ పై పీడీ యాక్ట్ కొనసాగించాలని ప్రభుత్వం స్పెషల్ ప్లీడర్ స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ లీడర్ రవికుమార్ లు వాదనలు వినిపించారు. పీడీ యాక్ట్ పిటిషన్‌ను హైకోర్టులో కొట్టివేయడంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసిం, ఎక్సైజ్ సిబ్బందిని అభినందించారు.






