- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురుకులాలను వేధిస్తున్న లైబ్రరీల కొరత.. కనీస వసతులు లేక ఇబ్బందులు
రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో లైబ్రేరియన్ పోస్టులు ఫిలప్ చేసిన గత ప్రభుత్వం లైబ్రెరీలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో లైబ్రేరియన్ పోస్టులు ఫిలప్ చేసిన గత ప్రభుత్వం లైబ్రెరీలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా లైబ్రేరియన్లు.. హాస్టళ్లలో వార్డెన్ విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది. తమను లైబ్రేరియన్పోస్టులో తీసుకొని ఇతర పనులు చేయాలని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ఆదేశించడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు. స్టేట్‌లోని మహాత్మజ్యోతిబాఫూలే బీసీ గురుకులాల్లో సుమారు 200 మంది లైబ్రేరియన్లు సంస్థ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు.
పోస్టు ఒకటి.. పని మరొకటి
గురుకులాల్లో నియమితులైన లైబ్రేరియన్లు.. విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించాలి. వారిలో పరిశోధనాత్మక దృక్పథం ఏర్పర్చాలి. సమాచారం అందించడంలో ప్రముఖ పాత్ర పొషించాలి. కానీ ప్రస్తుతం ఉన్న లైబ్రేరియన్లు ఇందుకు భిన్నంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అనేక గురుకులాల్లో ప్రభుత్వాలు సరైన లైబ్రెరీలు ఏర్పాటు చేయలేదు. మౌలిక వసతులు, పుస్తకాల సరఫరా, పత్రికలు, ఇతర వస్తువులు సమకూర్చలేదు. కనీసం లైబ్రెరీకి ప్రత్యేక రూమ్‌లు సైతం లేవనే ఆరోపణలున్నాయి. సంస్థ సైతం ఫెసిలిటీస్ గురించి ఆలోచించకుండా వారిపై వర్క్ప్రెజర్వేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిని కొందరు లైబ్రేరియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ విద్యాసంవత్సం నుంచి తాము వార్డెన్ విధులు నిర్వహించబోమంటూ ఉన్నతాధికారులతో తెగేసి చెప్పినట్టు తెలిసింది.
వార్డెన్ డ్యూటీలు చేయలేం..
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీసీ గురుకులాల్లో పని చేస్తున్న లైబ్రేరియన్లు సోమవారం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి సైదులును కలిశారు. లైబ్రేరియన్ పోస్టులో చేరిన తాము వార్డెన్ డ్యూటీలు చేయలేమని తెగేసి చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా గురుకులాల్లో కావాల్సిన అవసరాలు, ఇండెంట్స్‌లను వారు కార్యదర్శికి లిఖిత పూర్వకంగా అందజేశారు. దీనికి కార్యదర్శి సైతం సానూకులంగా స్పందించి, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చినట్టు సమాచారం.






