- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGIIC లేఅవుట్లకు ఆదరణ కరువు.. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికుల అనాసక్తి
పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక జోన్‌లను ఏర్పాటు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక జోన్‌లను ఏర్పాటు చేసింది. పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక జోన్‌ల ఏర్పాటుకు అధికారులు రూపకల్పన చేశారు. జిల్లాల ప్రాధాన్యత ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఐటీ, స్టీల్ రీలోరింగ్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రీసెర్చ్ డెవలప్‌మెంట్, తదితర పరిశ్రమలు స్థాపించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో కూడిన లే ఔట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నమూనాలో ప్లాట్లతో కూడిన లే ఔట్లను చేశారు. ప్రధానంగా రోడ్లు, విద్యుత్, నీటి వసతి, డ్రైనేజీ, ఇంటర్‌నెట్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఉత్పత్తి చేసిన వస్తువులను సులభంగా రవాణా చేసేందుకు ప్రధాన రహదారులకు సమీపంలో ఈ ప్రత్యేక జోన్(ఇండస్ట్రియల్ కారిడార్)లను ఏర్పాటు చేశారు. వీటిల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు కేటాయించిన ప్లాట్లలో స్థలాన్ని కోనుగోలు చేయాల్సి ఉంటుంది. చదరపు మీటరు చొప్పున విక్రయించేందుకు టీజీఐఐసీ ధరలు నిర్ణయించింది. ప్రస్తుతం ఈ జోన్‌లలో రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో 3,068 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో 7.87 కోట్ల చదరపు మీటర్ల ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. జిల్లా కేంద్రాల్లో, రియల్ ఎస్టేట్ పరంగా అక్కడి ప్రాంతాల్లోని భూములకు మార్కెట్ పరంగా ఉన్న ధరల ఆధారంగా ప్రత్యేక జోన్‌లలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ధరలను నిర్ణయించింది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన జోన్‌లలో చదరపు మీటరుకు రూ.1.54 లక్షల ధరను నిర్ణయించారు. ఇదే జిల్లాలోని ఉప్పల్ పారిశ్రామిక వాడలో ఖాళీగా ఉన్న ఒక ప్లాట్‌లో చదరపు మీటరు స్థలానికి కేవలం రూ.654 మాత్రమే నిర్ణయించారు. ఇలా సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలో చదరపు మీటరు ధర రూ.1.5 లక్షల నుంచి రూ.1,200 వరకు కూడా ధరలు ఉన్నాయి.
ఆ 4 జిల్లాల్లోనే అత్యధికంగా ఖాళీలు
పరిశ్రమల ఏర్పాటు కోసం చేసిన లే ఔట్లలో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 694 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాట్లలో 57,84,778 చదరపు మీటర్ల ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. సిద్దిపేట జిల్లాలో 674 ప్లాట్లలో 2,78,65,133 చదరపు మీటర్ల స్థలం ఖాళీగా ఉంది. జనగాం జిల్లాలో 424 ప్లాట్లు, కామారెడ్డి జిల్లాలో 224 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లాలో 157 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో 141 ప్లాట్లు, వరంగల్ జిల్లాలో 128 ప్లాట్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 108 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 15 జిల్లాల్లో 523 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
స్థలం కేటాయించినా..
పరిశ్రమల ప్రత్యేక జోన్‌లలో కొన్ని సంస్థలకు స్థలం కేటాయించినా సంబంధిత యాజమాన్యాలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేవు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కొన్ని ఫార్మా కంపెనీలు, ఐటీ సంస్థలు, మ్యాన్యుఫాక్షరింగ్ పరిశ్రమలకు స్థలం కేటాయించినా నేటికీ వాటి కార్యకలాపాలు మొదలు పెట్టలేవు. కొన్ని ల్యాబ్‌లకు పరిశోధనలు చేసేందుకు స్థలాలు కేయించినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేవు. ప్రధానంగా మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా, ఫారాడే, వైట్ గోల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పిన్ టెక్స్, ఇంటర్ కనెక్టిటెక్నార్ ప్రైవేటెడ్ లిమిటెడ్, ఫ్రాక్లింగ్ ఫర్, ట్రిన్యూటీ, ఎఫెక్టెడ్ తదితర సంస్థలకు స్థలాలు కేటాయించినా వాటి కార్యకలాపాలను ప్రారంభించలేవు.






