మేడారంలో కుంభమేళా సీన్ రిపీట్..!

by Jakkula.Mamatha |

ములుగు జిల్లా మేడారం(Medaram) లో భక్తుల రద్దీ పెరిగింది.

మేడారంలో కుంభమేళా సీన్ రిపీట్..!
X

దిశ,వెబ్‌డెస్క్: ములుగు జిల్లా మేడారం(Medaram) లో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమ్మక్క-సారలమ్మ(Sammakka Saralamma Jatara) దర్శనానికి క్యూలైన్‌లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రజెంట్ చలి తీవ్రత దృష్ట్యా భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని స్థానికులు వేడి నీళ్లను విక్రయిస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జంపన్న వాగు సమీపంలో కట్టెల పొయ్యిలపై నీటిని కాచి, ఒక్కో బకెట్‌ను రూ. 50కి అమ్ముతున్నారు. గతంలో కుంభమేళాలో పళ్లపుల్లల విక్రయాల తరహాలోనే, ఇక్కడ వేడి నీళ్ల వ్యాపారంతో వేలల్లో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం బకెట్ వేడి నీళ్లను రూ.50కి అమ్మడం పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. రోజురోజుకు మేడారంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story