Kumari aunty : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కుమారి ఆంటీ డీజే సాంగ్..

by Disha Web Desk 5 |
Kumari aunty : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కుమారి ఆంటీ డీజే సాంగ్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తెగ వైరల్ గా మారిన కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఇష్యూ గురించి తెలిసిందే. అయితే తాజాగా ఆమెపై డీజే సాంగ్ ని రీమిక్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఉన్న తన మాటలన్నింటినీ కలిపి దానికి మ్యూజిక్ ను జత చేసి రీమిక్స్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పాటను విన్న డీజే లవర్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు. అంతేగాక జనాలు కుమారి ఆంటీని మేయర్ చేసేలా ఉన్నారు, ఆంటీ ఆ.. మజాకా.. అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

కాగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీకి చెందిన సాయికుమారి ఫుడ్ సెంటర్ కి భారీగా జనం తరలి వస్తున్నారు. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద భారీగా ట్రాఫిక్ అవుతుందని పోలీసులు మూసివేయగా, ఆమెకు ఎంతో మంది నెటిజన్లు అండగా నిలిచారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, దాన్ని తిరిగి తెరిపించారు. అంతేగాక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ సెంటర్ ను విజిట్ చేస్తానని అనడంతో మరింత ఫేమస్ అయ్యింది.

Next Story

Most Viewed