- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌కు మళ్లీ చిప్పకూడు పక్కా: కేటీఆర్
ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జైలులో పెడితే బాల్క సుమన్ భయపడతాడని, మా నాయకులు భయపడతారని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నారు. బాల్క సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలేదు.. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆరు నెలలు జైలులో ఉన్నాడు. మాకు ఇలాంటివేమీ కొత్త కాదు. కానీ ఒకటి మాత్రం పక్కా. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి.. మళ్లీ నువ్వు చిప్పకూడు తినే సమయం ఖచ్చితంగా వస్తుంది’ అని హాట్ కామెంట్స్ చేశారు.
బట్టలు ఊడదీసి కొడతానన్నా కేసు పెట్టరా...?
‘బాధ్యతలు తీసుకోగానే డీజీపీ శివధర్ రెడ్డి పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టిండు. రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని. మరిప్పుడు ఖాకీ బుక్ ఎక్కడికి పోయింది?. మీ పోలీసులను యూజ్‌లెస్ ఫెలో అన్నా.. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతానన్నా.. కేసులు ఎందుకు పెట్టడం లేదు?. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్లకు ఒక నీతి, ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి మాకు మరో నీతా?. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. రెండు సంవత్సరాల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా మీ అరాచకాలకు తగిన శిక్షను అనుభవిస్తారు. ఈరోజు చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రతీ ఒక్కరినీ వదిలిపెట్టకుండా ఎక్కడున్నా పట్టుకొని ఖచ్చితంగా శిక్షిస్తాం’ అని కేటీఆర్ హెచ్చరించారు.






