- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : కేటీఆర్ అసలు రంగు బయట పడింది : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లోని రాజకీయ లుకలుకలు, కుటుంబ సంఘర్షణలు బయటికి వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లోని రాజకీయ లుకలుకలు, కుటుంబ సంఘర్షణలు బయటికి వస్తున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) నేడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీని బీజేపీ(BJP)తో కలపాలని చూస్తున్నారని.. ఆది తనకు ఏమాత్రం ఇష్టం లేదని కవిత రాజకీయ బాంబ్ పేల్చారు. తాను ఉంటే కుదరదని, తనను పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కవిత.. పార్టీలో కేసీఆర్(KCR) నాయకత్వం తప్పా ఎవ్వరి నాయకత్వం తాను ఒప్పుకోబోనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
అయితే ఈ వ్యవహరంపై తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రావు(MLA Adi srinivas) మాట్లాడుతూ.. కేటీఆర్(KTR) అసలు రంగు నేడు బయట పడిందన్నారు. సొంత చెల్లినే పార్టీలో తొక్కేయాలని కేటీఆర్ చూస్తున్నారని తెలిపారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకే సమాధానం చెప్పలేకపోతే, ఆయన ప్రజలకు ఏం చేయగలడని ప్రశ్నించారు. ట్విట్టర్లో కాదు.. బయటకు వచ్చి మాట్లాడాలని కేటీఆర్ కు కవిత సవాల్ విసిరిందని, కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.






