గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్.. జీసీసీ సమావేశంలో కేటీఆర్ కీలక ప్రసంగం

by Ramesh Naini |

హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారిందని.. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే మొదటి స్థానానికి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్.. జీసీసీ సమావేశంలో కేటీఆర్ కీలక ప్రసంగం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరం (Global Capability Centers) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారిందని.. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే మొదటి స్థానానికి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన జీసీసీ సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరం బెంగళూరును దాటి మరింత ప్రగతి సాధించాలని కోరారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారడం వెనుక గత ప్రభుత్వం కృషి ఎంతగానో ఉన్నదని చెప్పారు. పదేళ్లపాటు అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో హైదరాబాద్‌ నగరాన్ని సమగ్రంగా తీర్చిదిద్దడం వల్లనే ఇది సాధ్యమవుతున్నదని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తుల ఆధారంగా కాకుండా శాశ్వతంగా మంచి ఫలితాలు వచ్చేలా వ్యవస్థలను, చట్టాలను, సంస్కరణలను తీసుకురావడం వలన తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అందుకే బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ ఇవన్నీ రంగాల్లో భారీగా పెట్టుబడులను, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించగలిగిందని చెప్పారు. హైదరాబాద్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని.. వీటన్నింటినీ ఉపయోగించుకొని మరింత పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని చార్టెడ్ అకౌంటెంట్‌లకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలని ఎల్లప్పుడూ కోరుకుంటామని అన్నారు.

Next Story