- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయం అంటే రైతుభరోసా ఒక్కటేనా?: సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ ప్రభుత్వం(Congress Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుభరోసా నిధుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సచివాలయం ఎదుట ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Congress Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుభరోసా నిధుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సచివాలయం ఎదుట ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. దశాబ్దాల పాటు వ్యవసాయాన్ని దండగ చేసిందే కాంగ్రెస్ పాలకులు అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే మళ్లీ రైతులకు మంచి రోజులు వచ్చాయని.. రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రైతులు పాత రోజులు గుర్తుచేసుకుంటున్నారని విమర్శించారు. రూ.10 వేల రైతుబంధు స్థానంలో రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని ఓట్లు దండుకుని.. రూ.12 వేలకు కుదించడం సంబరమా? అని ప్రశ్నించారు. అసలు వ్యవసాయం అంటే రైతుభరోసా ఒక్కటేనా? అని సీరియస్ అయ్యారు.
‘సాగు నీటితో రైతుకు ప్రోత్సాహం ఇచ్చి, ఉచిత కరెంటుతో సాగుకు ఊతమిచ్చి, పంట పెట్టుబడికి రైతుబంధుతో వెన్నుదన్నుగా నిలిచి, మట్టిని నమ్ముకున్న రైతు కుటుంబాలకు రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల రైతుబీమాతో ధీమానిచ్చి, వందశాతం పంటల కొనుగోళ్లతో వ్యవసాయానికి భరోసానిచ్చిన దార్శనికుడు కేసీఆర్ అని అన్నారు. కరోనా విపత్తులోనూ కర్షకుల కష్టాలను గుర్తించి ఆదుకున్నాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం తప్పదు.. జాగో రైతన్నా జాగో.. జాగో తెలంగాణ జాగో’ అని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు. ట్వీట్






