- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండగా FSLలో సీఎం కుట్ర: కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. FSLలో అగ్నిప్రమాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పనే అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే ఇలా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ బిజీగా ఉన్నారు.. ఇదే అదునుగా భావించి కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. పక్కా ప్లాన్‌తో ఆధారాలు మాయం చేశారని మండిపడ్డారు. తాను తప్పించుకోవడానికి మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా దెబ్బతినేలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద ఘటనపై FSL డైరెక్టర్ తూతూమంత్రంగా వివరణ ఇచ్చారని విమర్శించారు. అగ్ని ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూడు అంతస్థుల భవనంలో మంటలను ఆర్పేందుకు మూడు గంటల సమయం పడుతుందా? అని ప్రశ్నించారు. దాంతో పాటు ప్రమాద సమయంలో డ్యూటీలో కూడా ఎవరూ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. స్వయంగా సీఎం చేతిలో ఉన్న శాఖలో ఇలా జరగడం చరిత్రలో తొలిసారి అన్నారు. విచారణ చివరి దశకు చేరుకోవడంతో సాక్ష్యాలు మాయం చేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డితో బీజేపీకి లాలాచీ లేకపోతే దీనిపై విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు.
అధికారుల వివరణ..
అగ్నిప్రమాదంపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రమాదానికి గల కారణాలపై వారు దర్యాప్తు చేపట్టారు. జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. ఈ ప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయినట్లు దుష్ప్రచారం జరుగుతోంది. ఆయా కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించాం. 2015 నాటి ఏసీబీ కేసు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసులోనూ ఆధారాలు కోర్టుకు సమర్పించాం. 2024 వరకు సేకరించిన 136 ఆధారాల్లో 7 మినహా మిగతావన్నీ న్యాయస్థానానికి ఇచ్చేశాం. అన్ని ఆధారాలు, పరికరాలను ఎఫ్‌ఎస్‌ఎల్ సురక్షితంగా ఉంచుతుంది. ఏదైనా జరిగితే మా టీమ్ సమాచారాన్ని పునరుద్ధరిస్తుంది అని శిఖా గోయల్ చెప్పారు.






