- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ మంత్రులు అలర్ట్‌గా ఉండాలి.. CM ఫోన్‌లు ట్యాప్ చేయిస్తున్నారు.. KTR సంచలన ఆరోపణలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో KTR మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే మంత్రుల ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన సీటుకు ఎక్కడి నుంచి త్రెట్ ఉందోనని నిత్యం భయపడుతున్నారని విమర్శలు చేశారు. అంతేకాదు.. బీఆర్ఎస్‌ను బ్లేమ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలు సపోర్ట్ చేస్తున్నారని.. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు రెండూ కలిసి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని మరోసారి ప్రకటించారు. రాష్ట్రంలో వందశాతం రుణమాఫీ ఏ గ్రామంలోనూ కాలేదని అన్నారు. ఢిల్లీ సంచులు మోసే హడావిడిలో సీఎం ఉంటే.. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలని మంత్రులు ఆలోచిస్తున్నారని విమర్శించారు. కొందరు పెద్దల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. మోసపోయామనే సంగతి ఇప్పుడు గ్రహించారని.. అందుకే కేసీఆర్ సభ కోసం వేయి కళ్లతో చూస్తున్నారని తెలిపారు. కల్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం, దళితబంధు పేరుతో రూ.12 లక్షలు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు ఇలా అనేక గాలి మాటలు చెప్పి ప్రజల్ని కాంగ్రెస్ నేతలు మోసం చేశారని మండిపడ్డారు. మోసపు హామీలతో గద్దెనెక్కారని సీరియస్ అయ్యారు.






