ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్‌తో పోల్చి.. CM రేవంత్‌పై కేటీఆర్ సెటైర్

by Gantepaka Srikanth |

ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్‌తో పోల్చి.. CM రేవంత్‌పై కేటీఆర్ సెటైర్

ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్‌తో పోల్చి.. CM రేవంత్‌పై కేటీఆర్ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్(KCR) పాలనలో పల్లెలు పచ్చగా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అనాథలయ్యాయని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆవేదన వ్యక్తం చేశారు. "కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠ ధామం వచ్చాయి. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. కానీ నేడు పరిస్థితి దారుణం. ట్రాక్టర్లకు డీజిల్ పోయించే దిక్కు లేదు. రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడి బాధలు పడుతున్నారని, ఆ చెప్పుల లైన్లు కనపడితే ప్రభుత్వం పరువు పోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలివిగా ‘యూరియా యాప్’ అనే కొత్త స్కీమ్ తెచ్చారు. షాపులో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా?" అని ఎద్దేవా చేశారు.

మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే

సర్పంచ్ ఎన్నికల(Sarpanch Election) కోసం ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. "ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్ నగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగురడం ఖాయం" అని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసి, జడ్పీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇంచార్జీ జాన్సన్ నాయక్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story