ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ సందేశం

by Gantepaka Srikanth |

రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షల(Intermediate Exams)కు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘ఈ పరీక్షల్లో మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని.. మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు.. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీలు సిలబస్ పూర్తి చేశాయని సంబంధిత అధికారులు తెలిపారు. హాల్ టికెట్ల జారీపై వచ్చిన సందేహాలకు కూడా స్పష్టత ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య ఒక ప్రకటనలో తెలిపారు.

మార్చి 18 వరకు పరీక్షలు..

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 863 ప్రైవేట్ కాలేజీలు, 404 ప్రభుత్వ కళాశాలలు, 221 ఎయిడెడ్ కాలేజీలు, మరో 7 ఇతర విద్యాసంస్థలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.

Next Story