బీజేపీలోకి గువ్వల బాలరాజు.. అచ్చంపేటలో కేటీఆర్ సభ

by Gantepaka Srikanth |

గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌(BRS)కు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

బీజేపీలోకి గువ్వల బాలరాజు.. అచ్చంపేటలో కేటీఆర్ సభ
X

దిశ, వెబ్‌డెస్క్: గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌(BRS)కు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడమే లక్ష్యంగా అచ్చంపేటలో సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. అచ్చంపేటలో తాము అందరం ఒక్కొక్కరం ఒక్కో మండలాన్ని దత్తత తీసుకుంటాం.. 8 జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలిచేలా ముందుకు సాగుతామని అన్నారు. పార్టీని ఎవరు వీడినా నష్టం లేదని.. కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఏ కార్యకర్తను ప్రభుత్వం వేధించినా ఊరుకోము.. దాడులు, కేసులు పెడితే క్షణాల్లో కార్యకర్త వద్దకు వస్తామని కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే.. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతున్నారని.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌ రావు స్పష్టం చేశారు. ఈ నెల 10న ఆయన బీజేపీలో చేరుతారని చెప్పారు.

Next Story