- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పరిస్థితి అదుపుతప్పింది.. మీరు దిగాల్సిందే: అమిత్ షాకు కేటీఆర్ లేఖ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో పరిస్థితులు దిగజారాయని.. సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
‘‘రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసింది. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయి అని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణం. సీఎం తన బినామీ కంపెనీ కోసమే అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదు.. తన బినామీ కంపెనీ కోసం సాక్షాధారాలను ముఖ్యమంత్రి మాయం చేయించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది.. పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోయింది. KLSR కంపెనీ దివాలా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారు. ఆ సంస్థ పై ఉన్న విచారణను అడ్డుకుంటున్నాడు.
రేవంత్ రెడ్డి జోక్యం..
KLSR కంపెనీ పైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసులపైన పక్షపాతం లేకుండా, ఒత్తిడి లేకుండా నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి. ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి 2500కు పైగా భారీ కాంట్రాక్టులను కేటాయించారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణ పనులను అడ్డగోలుగా రేవంత్ రెడ్డి దివాలా తీసిన ఈ కంపెనీకి అప్పచెబుతున్నారు. KLSR కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ KLSR కంపెనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఈ కంపెనీ చేస్తున్న నేరాలు, ఈ కంపెనీకి ముఖ్యమంత్రి చేస్తున్న అనుచిత లబ్ది నేపథ్యంలో సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) వంటి ఏజెన్సీలతో సంపూర్ణ దర్యాప్తు చేయించండి’’ అంటూ కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు లేఖ ప్రతులను నిర్మల సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి, కార్పొరేట్ గవర్నెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కి కూడా కేటీఆర్ పంపించారు.






