KTR : మొబైల్ ఫోన్ ఇచ్చేది లేదు : ఏసీబీకి కేటీఆర్ లేఖ

by Muthe.Rajitha |   (  Updated:2025-06-18 14:41:41  IST  )

ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula-E Race Case)లో భాగంగా ఏసీబీ(ACB) అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను సమర్పించాలని కోరిన విషయం తెలిసిందే.

KTR : మొబైల్ ఫోన్ ఇచ్చేది లేదు : ఏసీబీకి కేటీఆర్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula-E Race Case)లో భాగంగా ఏసీబీ(ACB) అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను సమర్పించాలని కోరిన విషయం తెలిసిందే. దీనికి సమాధానంగా నేడు కేటీఆర్ ఏసీబీకి లేఖ రాస్తూ.. ఫోన్‌లు సమర్పించడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యగా అభివర్ణించారు. 2024లో తాను మొబైల్ ఫోన్‌లు మార్చానని, గతంలో వాడిన పాత ఫోన్‌లు తన దగ్గర అందుబాటులో లేవని స్పష్టం చేశారు. ఆయన తరపు న్యాయవాదులు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ, ప్రత్యేక కోర్టు ఆదేశం లేకుండా వ్యక్తిగత ఫోన్‌లు లేదా ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకునే అధికారం ఏసీబీకి లేదని వాదించారు.

ఫార్ములా-ఈ రేసు సంబంధిత అధికారిక లావాదేవీలు బ్యాంకు ఖాతాల ద్వారా పారదర్శకంగా జరిగాయని, అవన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ఇప్పటికే అవన్నీ ఏసీబీకి సమర్పించబడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రీడా ఈవెంట్‌కు సంబంధించినదని, వ్యక్తిగతంగా తనకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఫోన్‌లు అడగడం అనవసరమని కేటీఆర్ అన్నారు. అయితే గత సోమవారం ఏసీబీ కార్యాలయంలో సుమారు ఏడు గంటలపాటు జరిగిన విచారణలో.. కేటీఆర్ తాను ఫోన్ తీసుకురాలేదని తెలపగా.. జూన్ 18లోపు సమర్పించాలని ఏసీబీ ఆదేశించింది. కాగా న్యాయవాదుల సలహా మేరకు, కేటీఆర్ ఫోన్ సమర్పించడానికి నిరాకరించారు.

Next Story