KTR : మహేష్ కుమార్ గౌడ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) కు లీగల్ నోటీసులు(Legal Notice) పంపించారు.

KTR : మహేష్ కుమార్ గౌడ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) కు లీగల్ నోటీసులు(Legal Notice) పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు గాను కేటీఆర్ ఈ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. తనకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే లీగల్ చర్యలకు వెళ్లాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంతకీ పీసీసీ చీఫ్ ఏమన్నారంటే.. టెలిగ్రాఫ్ చట్టానికి నిర్వీర్యం చేస్తూ, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం దుర్మార్గమైన చర్య అని.. ఇలాంటి పని చేసిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని అని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో వారు మాత్రమే అధికారంలో ఉండాలనే ఉద్ధేశంతోనే తమ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని, గతంలో కూడా తాము ఓడిపోడానికి కారణం ఈ ట్యాపింగ్ అయి ఉండవచ్చు అన్నారు. 2022 నుంచి కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయని, దాదాపు 650 మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని సిట్ తెలిపిందని.. దీనిపై కేసీఆర్, కేటీఆర్ ఏం మొహం పెట్టుకొని తిరుగుతారని మహేష్ కుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ పీసీసీ చీఫ్ కు లీగల్ నోటీసులు పంపించారు.

Next Story