- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలి.. కేటీఆర్ కీలక డిమాండ్
by Gantepaka Srikanth |
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. బహుజనుల రాజ్యాధికారం కోసం పాపన్న పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలోని నిరంకుశ పాలనకు వ్యతిరేకింగా ఫైట్ చేశారని అన్నారు. పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమానికి మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన విరోచిత పోరాటానికి గుర్తుగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని అన్నారు.
Next Story






