బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రేవంత్ వాడిండు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections), 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు(TG HighCourt) స్టే విధించిన విషయం తెలిసిందే.

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రేవంత్ వాడిండు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections), 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు(TG HighCourt) స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేటతెల్లమైందని అన్నారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీ తుంగలో తొక్కారని విమర్శించారు. ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. న్యాయస్థానంలో నిలబడని జీఓతో మభ్యపెట్టారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ కూడా బీసీలను వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేక.. ఎన్నికల వాయిదా కోసం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

Next Story