- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గెలిచిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సమావేశంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గెలిచిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సమావేశంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయింది కానీ ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు. రైతుబంధులు వచ్చే కాలం పోయి.. రాబందు పాలన వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక మంది రైతాంగం పండించే పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పత్తి రైతు చిత్తైపోయాడు. సోయా రైతులను పట్టించుకునే వాళ్ళు లేరు.. ఇట్ల మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో రైతలు రాజు లెక్క ఉండేవాడు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఇంటి ముందుకు వచ్చేవి. ఏనాడూ తెలంగాణలోని రైతులు కేసీఆర్ మీద కోపంతో లేరు. రైతుబంధు, రైతు బీమా ఇచ్చి, 7000 కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసిన చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. గోదావరి, కృష్ణ నదుల పైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశారు. అందుకే తెలంగాణ రాష్ట్రం పంజాబ్ వంటి రాష్ట్రాలను తలదన్ని దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం కొన్ని వేల ఓట్లతో అదిలాబాద్, ఖానాపూర్, కాగజ్ నగర్ వంటి నియోజకవర్గాలు కోల్పోయామని కేటీఆర్ అన్నారు. చిన్నచిన్న పొరపాట్ల వలన ఈ సీట్లని కోల్పోయాము కానీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉన్నామని ప్రజలు తేల్చి చెప్పారని గుర్తుచేశారు.






