- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ భవన్‌లో ఇఫ్తార్ విందు.. ముస్లింలకు KTR కీలక హామీ
by Gantepaka Srikanth |
రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఆయన రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, తనను ఆహ్వానించిన మైనారిటీ నేతలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్‌ను అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు. శాసనసభ సమావేశాల్లో, మైనారిటీ వర్గాలను కాంగ్రెస్ ఏ విధంగా వంచించిందో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతామని స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న ప్రతి హామీ పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు.
Next Story






