విచారణ నిష్పక్షపాతంగా జరిపించండి.. ఏపీ ప్రభుత్వానికి KTR కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

పాస్టర్ ప్రవీణ్(Pastor Praveen) మృతికి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంతాపం తెలిపారు.

విచారణ నిష్పక్షపాతంగా జరిపించండి.. ఏపీ ప్రభుత్వానికి KTR కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పాస్టర్ ప్రవీణ్(Pastor Praveen) మృతికి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంతాపం తెలిపారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలియజేశారు. పాస్టర్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. పాస్టర్ ప్రవీణ్ మృతి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రవీణ్ మార్చి 25న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆ రోజు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్టు(Rajahmundry Airport) నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళుతుండగా, గుర్తుతెలియని వాహనం ఆయన్ను ఢీకొట్టిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇది ప్రమాదమని అనుకుంటున్నప్పటికీ.. ఈ ఘటనపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్(Praveen) పగడాల మృతి సాధారణంగా జరిగినే ప్రమాదమేనా.. లేదంటే, పథకం ప్రకారం చేసిన హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story