‘ముక్కు నేలకు రాసి సారీ చెప్పు’.. CM రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘ముక్కు నేలకు రాసి సారీ చెప్పు’.. CM రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘SLBC టన్నెల్ తొవ్వడం చేతకాదు.. సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు.. చివరికి ఓ చెక్ డ్యామ్‌ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై బురద జల్లడం సిగ్గుచేటు.. మహబూబ్ నగర్‌లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ రెండునెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో CM రేవంత్ సమాధానం చెప్పాలి. నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటర్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒక్కరిపై సర్కారు చర్య తీసుకుని బాధితులను ఆదుకోవాలి. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలి’’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story