KTR: రాహుల్‌కు రూ.వెయ్యి కోట్లు.. రైతులకు వెన్నుపోటు

by Gantepaka Srikanth |

తెలంగాణ రైతన్నలకు వెన్నుపోటు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్‌గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామంటున్నదని.. కాంగ్రెస్ తీరును ఎండగతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

KTR: రాహుల్‌కు రూ.వెయ్యి కోట్లు..  రైతులకు వెన్నుపోటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైతన్నలకు వెన్నుపోటు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్‌గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామంటున్నదని.. కాంగ్రెస్ తీరును ఎండగతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతిసారి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి శాసనసభ సమావేశాలకు వెళ్లే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం సైతం బీఆర్ఎస్ శాసనసభ పక్షం అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాలకు చేస్తున్న మోసాలపై నినాదాలు చేసింది. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపింది. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని.. తాము వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీ చెప్పి ఇప్పటికీ రెండున్నర ఏళ్లు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేదన్నారు.

మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే సీఎం సంతకం పెట్టారని చెప్పారని.. ఇది మూడో గవర్నర్ ప్రసంగం అని.. ఇంతవరకూ చట్టబద్ధత లేదని అన్నారు. మరోవైపు.. పంటలు కోతలకు వచ్చినా రైతుబంధు దిక్కులేదని పేర్కొన్నారు. అందుకే రాహుల్ బంధు కాదు.. రైతుబంధు వేయండి.. రాహుల్‌కు రూ.1,000 కోట్లు, రైతులకు వెన్నుపోట్లా.. అని చెప్పి ఈ సభా సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తామని చెప్పారు. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారని.. ఇది మూడో బడ్జెట్ అని.. ఈపాటికే రూ.60 వేల కోట్లు పెట్టి ఉండాలని.. ఇంతవరకు దానిమీద కూడా స్పష్టత లేదని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం అన్నారని.. 12 లక్షలు ఇస్తామని ఇంతవరకు అతీగతి లేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదని ఆరోపించారు. మహిళలకు రూ.2500, 4 వేల పెన్షన్లు.. రైతు కూలీలు నెలకు వెయ్యి రూపాయలు.. ఆటో అన్నలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అన్ని విషయాలను తప్పకుండా ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు.

Next Story