- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే ఎక్కువ నష్టం: కేటీఆర్
అధికారంలోకి వచ్చి 500 రోజులైనా కాంగ్రెస్ పార్టీ ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రజలు వారి మాటలను నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అసెంబ్లీ ఎన్నిక్లలో ఓఆర్ఆర్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదని గోషామహల్ లో మన అభ్యర్థి ఆగమాగం చేయడంతోనే అక్కడ బీజేపీ గెలిచిందన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ (Congress) నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను కొంత మంది టెంప్ట్ అయి కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే మన తినే గిన్నెలో మట్టిపోసుకున్నట్లు అయిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తారు. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు మంచి పనులు చేశారు. వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో వారు చేసిన మంచిపనులుంటే కేసీఆర్ కొనసాగించారని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్నారని మండిపడ్డారు. కానీ ఆనావాళ్లు తొలగిస్తామని అనడం అనాగరిక చర్య అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 500 రోజులు అయినా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ఎన్నికల్లో జరిగిన నష్టం బీఆర్ఎస్ (BRS) పార్టీ కంటే తెలంగాణ సమాజానికే ఎక్కువ జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకోవడం మన పార్టీ అవసరం కాదని ఇది తెలంగాణ సమాజం కోసం చారిత్రక అవసరం అన్నారు.
అంతా నెగిటివ్ పాలిటిక్స్:
కేసీఆర్ హయాంలో పదేళ్లలో ఒక్క ప్లాట్, వెంచర్, బిల్డింగ్ వద్దకు వెళ్లి దాదాగిరీ చేసే దమ్మున్నోడు లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ హాయంలో ఎవరికి దోచుకున్నంత దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదలను కొడుతున్న హైడ్రా మంత్రులు, కాంగ్రెస్ నేతల వద్దకు ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి అన్ని నెగిటివ్ పనులే తప్ప పాజిటివ్ పనులు లేవన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీకి మాత్రం లక్షన్నర కోట్లా అని ప్రశ్నిచారు. మూసీతో మురిసే రైతులు ఎంతమంది? దాంతో వచ్చే ఆయకట్టు ఎంతా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన వద్దనడం లేదు. కానీ మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా సంక్షేమ పథకాలు నిధులు లేకుండా మూసీ సోకులు ఎందుకు అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లకు రెండు బడ్జెట్ లలో నిధులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఒక్క ఇటుక పెట్టలేదన్నారు. దేశజనాభాలో 3 శాతం కంటే తక్కువ ఉన్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఇచ్చే 30 ఉత్తమ పంచాయతీ అవార్డులు గెలుచుకుందన్నారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటిని సమానంగా తీసుకువెళ్లారన్నారు.
మోడీ చేసిందేటి?
పదకొండేళ్లుగా హిందూ, ముస్లిలను మతం పేరుతో విభజించడం తప్ప నరేంద్ర మోడీ (Narendra Modi) చేసిందేమి లేదన్నారు. మోడీ వచ్చాక తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. మోడీ, రేవంత్ రెడ్డి నెగిటివ్ పాలిటిక్స్ తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులు పెడితే ఇప్పటి వరుక రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడలేదని ఇది రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒకరినొకరు కాపాడుకునేందుకు సంకేతమా అని ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ శత్రువులేనన్నారు. గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం అన్నారు. చేవెళ్ల, రాజేంద్రనగర్ లో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని అక్కడ కాంగ్రెస్ కు దిమ్మతిరేగేలా పార్టీ గెలవాలన్నారు.






