KTR: హైడ్రా మంచే అయితే ఫైవ్ స్టార్ హోటళ్లల్లో మీటింగ్స్ వెనక మతలబేంటి?: కేటీఆర్

by Prasad Jukanti |

హైడ్రా బాధితులతో కేటీఆర్ భేటీ అయ్యారు.

KTR: హైడ్రా మంచే అయితే ఫైవ్ స్టార్ హోటళ్లల్లో మీటింగ్స్ వెనక మతలబేంటి?: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలో బుల్డోజర్ ను అడ్డుకుంటానని చెబుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో హైడ్రా బాధితులతో కేటీఆర్ సమావేశం అయ్యారు. హైడ్రా పని తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఇండ్లను కూల్చే హైడ్రా (Hydra) చేసేది మంచే అయితే.. ఫైవ్ స్టార్ హోటళ్లల్లో మీటింగ్స్ పెట్టడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది నిజంగానే ప్రజా పాలన అయితే.. కాంగ్రెస్ నాయకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. పెద్దల ఇండ్లను ఎందుకు కూల్చలేదు, కనీసం నోటీసులు అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

గతంలో భట్టి విక్రమార్క హైడ్రా చేస్తోంది గొప్పదని పలువురి పేర్లను ప్రస్తావించారని మరి హైడ్రా బుల్డోజర్లు అటువైపు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. హైడ్రా అధికారుల తీరుపై మండిపడ్డ కేటీఆర్ ఇది ప్రభుత్వ యాంత్రాంగమా లేక రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యమా అని నిలదీశారు. మంత్రి వివేక్ వెంకట స్వామి ఇళ్లు హిమాయత్ సాగర్ లో ఎఫ్టీఎల్ పరిధిలోపలే ఉందని, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోదరుడు తిరుపతి రెడ్డి బఫరో జోన్ లోనే ఉన్నారు. కానీ వీళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Next Story