కాంగ్రెస్‌పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు.. జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-22 07:38:47  IST  )

కాంగ్రెస్ పార్టీ థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.

కాంగ్రెస్‌పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు.. జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ నేడు కేటీఆర్‌‌కు చిల్లర పార్టీ అయిందా అని మండిపడ్డారు. అసలు ఇన్నాళ్లు కల్వకుంట్ల కుంటుంబం రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే తమ పార్టీ పెట్టిన భిక్షేనని అన్నారు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే.. కల్వకుంట్ల కుటుంబానిది డ్రామాల కుటుంబమని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

నాడు సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కలిసినప్పుడు ఏం అనిపించ లేదా సెటైర్లు వేశారు. కేసీఆర్, కేటీఆర్ వెలిగిపోవడానికి కారణం కాంగ్రెస్‌నే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అ్నారు. కాంగ్రెస్‌ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆరే క్యారెక్టర్ లేనివాడని అన్నారు. ఇంకా ఆయనకు రాజకీయ పరిపక్వత రావాల్సి ఉందని తెలిపారు. నిండు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని చెప్పిన విషయం మరిచారా అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ అయితే.. కేటీఆర్ అయ్య కూడా అదే థర్డ్ క్లాస్‌ వ్యక్తి అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story