- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: మా మద్దతు వాళ్లకే.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతుపై తేల్చేసిన కేటీఆర్
ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Vice President) ఉపరాష్ట్రపతి ఎన్నికలో (BRS) బీఆర్ఎస్ మద్దతుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు కూటమి పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయని వెల్లడించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సర్వ స్వతంత్ర్యమైన పార్టీ అని స్పష్టం చేశారు. మాకు ఢిల్లీలో బాస్‌లు లేరు.. ఏ పార్టీ కూడా మాకు బాస్‌లు కారు.. మాకు తెలంగాణ ప్రజలే బాస్‌లు తప్ప.. మాకు ఢిల్లీలో పెద్దలు, ఆదేశించేవారు ఎవరూ లేరు.. అని కేటీఆర్ తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మాకు ఏ పార్టీ, అభ్యర్థులు కానీ మమ్మల్ని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోందని, కేవలం మీడియాలో చూసేదాకా తెలియదన్నారు. ఎన్నికపై మమ్మల్ని ఎవరూ కూడా సంప్రదించలేదు.. ఎన్నికకు ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. బీఆర్ఎస్ నేతలు కలిసి ఆలోచించుకోని ఎలక్షన్ సమయానికి మా వైఖరి ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
మేము ఎన్డీఏ (NDA) కూటమీలో లేము.. ఇండియా (INDIA Alliance) కూటమిలో లేము.. అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి సపోర్ట్ చేయాలనే దానిపై కూడా మాకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీ మా బాస్‌లు కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థి అయితే కచ్చితంగా వ్యతిరేకిస్తామని విమర్శించారు. కాంగ్రెస్ అనేది ఒక చిల్లర పార్టీ అని.. అలాంటి ముఖ్యమంత్రి పెట్టిన అభ్యర్థిని మేము సమర్ధిస్తామని ఎలా అనుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా జరుగుతోందన్నారు.
బీసీల విషయంలో మా పార్టీ చిత్తశుద్ధి ఉందని చెప్పి.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక్క బీసీ అభ్యర్ధి దొరకలేదా? అని నిలదీశారు. సామాజిక వేత్త కంచె ఐలయ్యను అభ్యర్థిగా పెట్టి మీ చిత్తశుద్ధి నిరుపించుకోవాల్సిందని సూచించారు. బీసీ అభ్యర్ధులను పెట్టరు.. కానీ మీ మాటలు మేము నమ్మాలా? అని ప్రశ్నించారు. రెండు పార్టీలు దొందూ.. దొందే.. వారు తెలంగాణకు ఏమి చేయలేదన్నారు. కాబట్టి సెప్టెంబర్ 9 లోపు రెండు లక్షల టన్నుల ఎరువులు ఎవరు తీసుకొచ్చి పెడితే ఆ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థికే బీఆర్ఎస్ సానుకూలంగా ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు.
Also Read..
ప్రభుత్వ చేతగానితనం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి.. కేటీఆర్ ఫైర్






