కేసీఆర్ విచారణకు పూర్తిగా సహకరించారు: నందినగర్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణ ముగిసింది.

కేసీఆర్ విచారణకు పూర్తిగా సహకరించారు: నందినగర్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణ ముగిసింది. హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలకు పైగా సిట్‌ అధికారులు ప్రశ్నించారు. అనంతరం నందినగర్‌ నివాసం వద్ద సిట్ విచారణపై పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ కేసులో లీకులే తప్ప ఆధారాలు లేవని, కేసులో డొల్లతనం బయటపడిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మా అటెన్షన్ దెబ్బతీయడానికే ఈ విచారణలు చేపట్టినట్లు ఆరోపించారు. విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. విచారణ చేసేది సిట్టా, పీసీసీనా లేక బీజేపీనా? అని విమర్శించారు. సీఎం రేవంత్ గాలి మాటలు మాట్లాడుతూ గాలికి తిరుగుతున్నారు.. ఇదిగో పులి, అదిగో తోక అంటూ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. సిట్ చట్టాన్ని అతిక్రమించినా కేసీఆర్ విచారణకు సహకరించారన్నారు. సిట్‌కు సంపూర్ణంగా కేసీఆర్ సహకరించారని స్పష్టం చేశారు. పత్రి ప్రశ్నకు కుండబద్దలు కొట్టినట్టుగా కేసీఆర్ సమాధానమిచ్చారని స్పష్టం చేశారు. ఎలాంటి తప్పు జరగలేదని నేటి విచారణతో తేలిపోయిందన్నారు.

Next Story