- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీడిమెట్ల పారిశ్రామిక కార్మికులతో కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త HILTP జీవోతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త HILTP జీవోతో 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ HILTP జీవోకు వ్యతిరేకంగా భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్‌లోని షాపూర్లో హమాలీలతో మాట్లాడి.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన HILTP జీవో వల్ల కలిగే నష్టాలను వివరించారు. అలాగే ప్రధాని మోడీ కార్మికులకు రోజుకు రూ.174 రూపాయల మినిమం వేజెస్ సరిపోతాయని చెప్తున్నాడని వారికి గుర్తు చేయగా.. అంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో వారికే తెలియాలి అంటూ తమ బాధను కేటీఆర్‌కు కార్మికుడు వివరించాడు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.






