భూపాల‌ప‌ల్లిలో కేటీఆర్ సుడిగాలి ప‌ర్యటన.. 297.32 కోట్ల ప‌నుల‌కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన

by Taduka Kalyani |

భూపాల‌పల్లి నియోజ‌క‌వ‌ర్గంలో 297.32 కోట్ల విలువైన పలు పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు.

భూపాల‌ప‌ల్లిలో కేటీఆర్ సుడిగాలి ప‌ర్యటన.. 297.32 కోట్ల ప‌నుల‌కు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: భూపాల‌పల్లి నియోజ‌క‌వ‌ర్గంలో 297.32 కోట్ల విలువైన పలు పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం భూపాల‌పల్లిలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు గణపురం మండలంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధుసూదన్ చారిలు పాల్గొన్నారు.

గ‌ణ‌పురం చేరుకున్న కేటీఆర్ ముందుగా రూ. కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ‌ణ‌పురం తహసీల్దార్ కార్యాలయాన్ని, రూ.4కోట్లతో నిర్మించిన బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. అనంతరం మంజూరు నగర్‌లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం 229 కోట్లతో నిర్మించిన 994 క్వార్టర్లను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం భూపాలపల్లిలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని, సుభాష్ నగర్ కాలనీలో 14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వండర్ స్టాల్స్ ను, దివ్యాంగుల కోసం రూ. 23లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం భాస్కర్ గడ్డలో రూ. 33 కోట్ల వ్యయంతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు.

అనంతరం భూపాల్ పల్లి పట్టణంలో బృహత్వం మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద రూ. 6 కోట్ల 80 అంచనాతో చేపట్టే మిషన్ భగీరథ పనులకు, రూ. 4.5 కోట్లతో చేపట్టే మిని స్టేడియం నిర్మాణ పనులకు, కోటి రూపాయలతో చేపట్టే జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ జక్కుల శ్రీ హర్షిని, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డీఎస్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story