- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: మాకు ఓ రోజు వస్తుంది.. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్.. ఎందుకంటే?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీస్‌లకు వార్నింగ్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ సోషల్ మీడియా (BRS Social Media) యాక్టివిస్ట్ శశిధర్ గౌడ్ (నల్లబాలు) కు గోదావరిఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన జైలు నుంచి విడుదల కాకముందే మరోకేసులో శశిధర్ గౌడ్‌ను రామగుండం పోలీసులు అరెస్ట్ చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రియాక్ట్ అయ్యారు. గురువారం ఎక్స్ వేదికగా (Telangana police) తెలంగాణ పోలీస్‌లకు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు జరుగుతున్నది అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఎవరు శాశ్వతంగా ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. మాకు కూడా ఒక రోజు వస్తుందని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది.. మేము పోరాడుతూనే ఉంటాము.. అని కేటీఆర్ తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేశారు.
కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ఎక్స్ ఖాతాలో బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయడంతో శశిధర్‌పై కరీంనగర్, గోదావరిఖని, రామగుండం, హైదరాబాద్‌లో ఐదు వేర్వేరే కేసులను నమోదు చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసిన కరీంగనర్ సైబర్ క్రైమ్ పోలీసులు జూన్ 29న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అధికార పార్టీ ఒత్తిడి మేరకు పోలీసులు అత్యుత్సాహంతో శశిధర్ గౌడ్ (Nallabalu)ను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.






