కేటీఆర్ vs నారా లోకే‌శ్! ఇద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు? నెట్టింట హాట్ టాపిక్

by Ramesh N |   ( Updated:2025-03-09 16:29:02.0  )
కేటీఆర్ vs నారా లోకే‌శ్! ఇద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు? నెట్టింట హాట్ టాపిక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి లోకేశ్ (Nara Lokesh).. ఇద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు? అనే చర్చ మళ్లీ మొదలైంది. తాజాగా ఎక్స్ వేదికగా అటు టీడీపీ, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య నెట్టింట వరుస ట్వీట్‌లకు కౌంటర్‌లు ఇచ్చుకుంటున్నారు. మా నాయకుడు గొప్ప అంటే.. మా నాయకుడే గొప్ప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎప్పుడూ ఓడిపోలేదని, లోకేశ్ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారని కేటీఆర్‌ను కొంత మంది సమర్ధించారు. ప్రతికూల పరిస్థితిలో కూడా టీడీపీ పార్టీని అధికారంలోకి లోకేశ్ తీసుకువచ్చారని మరి కొందరు లోకేశ్‌ను సమర్ధించారు. అయితే తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్.. కేటీఆర్ వల్లే అధికారం కోల్పోయిందని టీడీపీ కేడర్ విమర్శిస్తోంది. కేటీఆర్‌తో లోకేశ్‌ను పోల్చడం కరెక్ట్ కాదని, ఉద్యమంలో పాల్గొన్న నేత కేటీఆర్ అని బీఆర్ఎస్ కేడర్ పేర్కొంది. ఈ క్రమంలోనే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఇద్దరిలో ఎవరూ గొప్ప? అని తాజాగా హాట్ టాపిక్‌గా మారింది.

READ MORE ...

ప్రత్తిపాడు జనసేన నేతపై పవన్ సీరియస్.. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచన








Next Story

Most Viewed