MLA మాగంటి గోపీనాథ్‌ను పరామర్శించిన కేటీఆర్

by Gantepaka Srikanth |

ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

MLA మాగంటి గోపీనాథ్‌ను పరామర్శించిన కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను శనివారం కలిశారు. మాగంటి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. గోపీనాథ్‌కు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ తొరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, రవీందర్ రావు, నాయకులు మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇతర నాయకులు ఉన్నారు.

Next Story