KTR: గాయపడ్డ ఆశా వర్కర్‌ను పరామర్శించిన కేటీఆర్.. ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

by Ramesh Naini |   (  Updated:2024-12-10 08:37:45  IST  )

హైదరాబాద్- కోఠి డీఎంఈ ఆఫీస్ ముందు నిన్న నిరసనలో గాయపడిన ఆశా వర్కర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

KTR: గాయపడ్డ ఆశా వర్కర్‌ను పరామర్శించిన కేటీఆర్.. ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్- కోఠి డీఎంఈ ఆఫీస్ ముందు నిరసనలో నిన్న గాయపడిన ఆశా వర్కర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. (Osmania General Hospital) ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్‌ను మంగళవారం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి, జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పలువురు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్‌కు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, ఆశ వర్కర్ల తరఫున కొట్టాడుతానని ధైర్యం చెప్పారు.

ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

బీఆర్ఎస్ నేతలు ఉస్మానియా ఆసుపత్రికి రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ తో పాటు కొంతమందిని మాత్రమే ఆసుపత్రి లోపలికి పోలీసులు అనుమతించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీస్ జులుం నశించాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రి లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో అస్వస్థతకు గురై మరో మహిళా ఆశా వర్కర్ స్పృహతప్పి పడిపోయింది.


Also Read...

Minister Ponnam: ముందు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు.. కేటీఆర్ : మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Next Story