- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌదీలో యువకుడికి రోడ్డు ప్రమాదం.. కేటీఆర్ భరోసా
సౌదీలో ( Saudi) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి కేటీఆర్ (KTR) అండగా నిలిచారు. సౌదీలో రోడ్డు ప్రమాదంలో

దిశ, వెబ్ డెస్క్ : సౌదీలో ( Saudi) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి కేటీఆర్ (KTR) అండగా నిలిచారు. సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్ ( Manda mahesh) గాయపడ్డాడు. ఇక ఈ ప్రమాదంపై స్పందించి మంద మహేష్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు కేటీఆర్. పనికి వెళ్తున్న సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదంలో గాయపడి, అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మంద మహేష్.
ఇక ఈ ప్రమాదంపై స్పందించి సొంత ఖర్చులతో మంద మహేష్‌ను ఇండియాకు తెప్పించి, మెరుగైన వైద్యం చేయిస్తానని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు కేటీఆర్. మంద మహేష్ స్వస్థలం సిరిసిల్ల ( Siricilla) నియోజకవర్గంలోని మండేపల్లి గ్రామం అని చెబుతున్నారు.
కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మంద మహేష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఇక తాజాగా సౌదీలో చికిత్స పొందుతున్న మందం మహేష్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు కేటీఆర్. అధైర్యపడొద్దు... నాలుగు ఐదు రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తాను అని భరోసా ఇచ్చాడు.
🔷 బాధపడకండి.. మహేష్‌ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇
— Mission Telangana (@MissionTG) May 11, 2025
🔹జీవనోపాధి కోసం గల్ఫ్ దేశం పోయి, అక్కడ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మండేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేష్ కుటుంబాన్ని… pic.twitter.com/SO5L5e7tSC






