ఓపెన్​ఏఐ తన కార్యక్రమాలు హైదరాబాద్​నుంచి ప్రారంభించాలి : కేటీఆర్​

by Naga Rani Yarlagadda |

ఓపెన్​ఏఐ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించడానికి హైదరాబాద్ అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉందని, ఇక్కడి నుంచి భారత దేశ కార్యకలాపాలను ప్రారంభించాలని ఈసంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ ను బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ ​కె.తారక రామారావు కోరారు.

ఓపెన్​ఏఐ తన కార్యక్రమాలు హైదరాబాద్​నుంచి ప్రారంభించాలి : కేటీఆర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఓపెన్​ఏఐ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించడానికి హైదరాబాద్ అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉందని, ఇక్కడి నుంచి భారత దేశ కార్యకలాపాలను ప్రారంభించాలని ఈసంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ ను బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కె. తారక రామారావు కోరారు. శనివారం తన ట్వీట్‌లో, వచ్చేనెల భారత్​లో పర్యటిస్తున్నానని తెలిపిన సామ్ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్ నగరానికి స్వాగతం పలుకుతుందన్నారు. హైదరాబాద్‌ను భారతదేశానికి సరైన ప్రవేశ ద్వారంగా, ఓపెన్​ఏఐ లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా అభివర్ణించారు. ఈ నగరం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, ఇందులో టి హబ్, వీహట్, టి వర్క్​, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటివి ఉన్నాయని తెలిపారు.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్‌కామ్ లాంటి అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలకు కేంద్రంగా మారిందని, ఇక్కడ సాంకేతిక, స్టార్టప్ రంగాలలో అపారమైన ప్రతిభ ఉందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వం, భారతదేశానికి ఏఐ రాజధానిగా రాష్ట్రం మారడానికి అనేక సాహసోపేతమైన చర్యలు తీసుకుందని, ఇందులో 2020ని ఇయర్ ఆఫ్ ఏఐ గా ప్రకటించడం అనేక కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతిభ, ఇన్నోవేషన్, నూతన ఆవిష్కరణలు, మరియు గ్లోబల్ కనెక్టివిటీల కలయికతో ఏఐ విప్లవాన్ని ముందుకు నడిపిస్తుందని నొక్కి చెప్పారు.

Next Story