Medchal: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Medchal: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) నియంత పోడకలను ప్రజలు గమనించాలని సూచించారు. ఏడాదిలోనే ప్రజల్లో ఆదరణ కోల్పోయిన ప్రభుత్వం ఇది తప్ప మరొకటి లేదని విమర్శించారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌(KCR)ను తక్కువ చేసి చూపించాలనే దురుద్దేశంతోనే రేవంత్(Revanth Reddy) సర్కార్ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కొత్త విగ్రహం కాకుండా.. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తరహా విగ్రహాన్ని విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Next Story