- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు బీఆర్ఎస్ పగ్గాలు.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హరీష్ రావు
బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యనేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యనేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతించి సహకరిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీకి అధ్యక్షుడని, తాను ఆయన ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని చెప్పారు. ఒక కార్యకర్తగా హరీశ్‌రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసావహిస్తాడే తప్ప పార్టీ గీత దాటే వ్యక్తి కాదన్నారు. ఇంతేకాకుండా హరీస్ రావు పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి.
రాష్ట్ర సొంత ఆదాయం 2025-26 సంవత్సరానికి రూ.1,34,208 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలో ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఆస్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి సొంతమని, దీనిని విక్రయించడం ద్వారా పెద్దఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు. ఈ సందర్భంగా సీఎం.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
‘మా ఆడబిడ్డల సిందూరం తొలగిస్తే ఇళ్లల్లోకి దూరిమరీ చంపేస్తాం’ అని ఉగ్రవాదులకు ప్రధాని మోడీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ సాధారణమైన సైనిక విన్యాసం కాదని, ఇది భారతదేశ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనం అని అన్నారు. ఈ ఆపరేషన్‌లో పరాక్రమాన్ని చూపిన భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వీరులకు నా సెల్యూట్ అని చెప్పారు. భారత సైన్యం శక్తిసామర్థ్యాలు చూసి తన జీవతం ధన్యమైందని, భవిష్యత్ కాలానికి మీరంతా ప్రేరణగా నిలుస్తారన్నారని పేర్కొన్నారు. ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన మోడీ అక్కడ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఐపీఎల్-2025లో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెల్లవారే ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ప్రత్యక్షమయ్యారు. కోహ్లీ తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి బృందావన్‌లో స్వామి ప్రేమానంద్ మహారాజ్ కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆధ్యాత్మిక అభిరుచులకు పేరుగాంచిన ఈ సెలబ్రిటీ జంట ముఖ్యంగా వారి జీవితంలోని ముఖ్యమైన క్షణాల్లో అనేక మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఇంకా ఎక్కడెక్కడ పర్యటించారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి






