పారా అథ్లెట్‌‌కు కేటీఆర్‌ హెల్ప్

by Gantepaka Srikanth |

పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.

పారా అథ్లెట్‌‌కు కేటీఆర్‌ హెల్ప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన శుక్రవారం హైదరాబాద్‌లోని నంది నగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిశారు. కుట్టుపని ద్వారా తన జీవనోపాధిని గడుపుతున్న అర్చన, డిసెంబర్ 8 నుండి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఎంపికయ్యారు. అయితే.. ప్రయాణ ఖర్చులు, ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అర్చనకు కేటీఆర్ ప్రయాణ, క్రీడా ఖర్చులన్నింటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని ఆమెకు అందజేశారు.

ఆశపడి మోసపోయాం.. అండగా నిలవండి

యూత్ డిక్లరేషన్ల పేరిట అనేక హామీలిచ్చి మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్న నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ హామీలను మరోసారి గుర్తుచేయడానికి, ప్రభుత్వ మెడలు వంచడానికి తలపెట్టిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరవ్వాలని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కలిసి ఆహ్వానించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న జల విహార్‌లో తలపెట్టిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని నిరుద్యోగులు ఆహ్వానించారు.

Next Story