- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్‌పై రెచ్చిపోయిన కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు(Cotton Farmers) సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని మండిపడ్డారు. పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ అంశంలో వెంటనే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వెంటనే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో సీసీఐ(CCI) కొనుగోలు నిరాకరిస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులకు భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపారు. కనీస మద్దతు ధర కూడా పత్తి రైతుకు దక్కడం లేదన్నారు.
నెల రోజుల్లో కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి కొనుగోలు, 28 లక్షల టన్నుల లక్ష్యం కంటే కొనుగోళ్లు అతి తక్కువగా ఉండటం రాష్ట్రంలో నెలకొన్న పత్తికొనుగుల సంక్షోభానికి నిదర్శనం అన్నారు. ఈ అంశంలో వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి దిక్కులేని పరిస్థితి నెలకొనడంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ మరియు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయని మండిపడ్డారు.
ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఎంపీలు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చొరవ చూపించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చించి రాష్ట్ర రైతన్నల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు నిబంధనలతో, కుంటి సాకులతో కొనుగోలు ఆపివేసిన సీసీఐ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా ఎండగట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన రైతన్నకు కనీస మద్దతు ధర కూడా దొరకడం లేదని, తీవ్రమైన వర్షాల వలన ఇప్పటికే పంట నష్టం వలన ఇబ్బందులు పడుతున్న రైతన్నలు మిగిలిన పంటను కూడా అమ్ముకోలేక నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న రైతన్నలను పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మరియు కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ కూడా తెలంగాణ పత్తి రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలోని లక్షల మంది రైతన్నలు తమ పత్తిని కొనుగోలు చేసే దిక్కులేక ఆందోళన చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాల్‌కు రూ. 8,110 కనీస మద్దతు ధర (MSP) ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో రైతులు కేవలం రూ. 6,000 నుండి రూ. 7,000 రూపాయలు మాత్రమే రైతులకు దక్కడం అత్యంత కష్టంగా మారిందన్నారు. దీనివల్ల ప్రతి క్వింటాల్‌పై రైతులు దాదాపు రూ. 2,000 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన ఎడతెగని వర్షాల కారణంగా పత్తి తడిసిపోయి, తేమ శాతం పెరిగి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు ఇదే సాకును చూపించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తేమ ఎక్కువగా ఉన్న పత్తి కొనుగోలును చేయకుండా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. రైతుల విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకపోవడం రైతుల పట్ల ప్రభుత్వాలకు ఉన్న ఉదాసీనతకు నిదర్శనం అన్నారు. ట్వీట్






