KTR రైతుల విష‌యంలో దుష్ప్రచారం మానుకో: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్

by Kema Shiva Kumar |

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని, కేటీఆర్ రైతులను తప్పుదోవ పట్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

KTR రైతుల విష‌యంలో దుష్ప్రచారం మానుకో: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రైతు డిస్కం’ అంశం విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా కేటీఆర్ (KTR) పచ్చి అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఆ మాట ఎన్నడూ అనలేదని అనలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని, కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు.

‘రైతు డిస్కం’ పెడితే కేటీఆర్‌కు ఎందుకు నొప్పి..

రైతుల ప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ (Rythu Discom) ఏర్పాటు చేస్తుంటే కేటీఆర్‌కు ఎందుకు నొప్పి అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారని గుర్తు చేశారు. మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయదు.. ఒకవేళ తాము మీటర్లు పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా తప్పుకుంటుందా అని సీఎం విసిరిన సవాల్‌ను కేటీఆర్ ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. అయినా కేటీఆర్ రైతులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న కేటీఆర్‌ను సన్నాసి అనాలా.. లేక ఏమనాలో అర్థం కావడం లేదని ఆది శ్రీనివాస్ గరం అయ్యారు.

Next Story