- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: గాలి మాటలు గబ్బు కూతలు..రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ట్వీట్
మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకును డు తప్ప రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రేసీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 39 సార్లు ఢిల్లీకి వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప ఢిల్లీ నుండి ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రేవంత్ రెడ్డి తీరు గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు అన్నట్లుగా ఉందని ఆయన కాలు గడప దాటదు కానీ ఢిల్లీలో మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని సెటైర్ వేశారు. ఈ మేరకు ఇవాళ కేటీఆర్ ట్వీట్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి (Delhi tour) చక్కర్లు కొడుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీతోనీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి ఊడితే మాకేంటి తెలంగాణకు ఒరిగేది ఏంటి అని ప్రశ్నించారు. గ్రామ గ్రామాన గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ విమర్శించారు. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు హామీల అమలు చేతగాక గాలి మాటలు గబ్బు కూతలు కూస్తున్నారని.. జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.






