- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
నందినగర్ లోని నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సమావేశం అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై చర్చించారు.

దిశ, వెబ్ డెస్క్: నందినగర్ లోని నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సమావేశం అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై చర్చించారు. దీంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీ, మున్సిపల్) మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని, రెండున్నరేళ్ల పాలనలో చేసిన మోసాలు, అవినీతి, కుంభకోణాలను చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అరాచకాలు చూసిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తూనే ఉందని, నిన్న పెంచిన రూ.1000 గ్యాస్ సిలిండర్ ధర ఇందుకు నిదర్శనం అని తెలిపారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేయాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరియు ఇతర ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






