- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్ విమాన ప్రమాదంపై KTR దిగ్భ్రాంతి
గుజరాత్(Gujarat)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్(Gujarat)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటన తన హృదయాన్ని కలిచివేసిందన్నారు. విమాన ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, మెడికోలు మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని భరించే శక్తి బాధిత కుటుంబాలకు లభించాలని ప్రార్థించారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.
Next Story






