- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతా.. KTR సెన్సేషనల్ స్టేట్‌మెంట్
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో భారీ కుంభకోణాన్ని(Huge Scam) బయటపెడతానని ప్రకటించారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ(BJP MP) పాత్ర కూడా ఉందని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని అన్నారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వదులుదామనుకున్న బాంబులు తుస్సుమన్నయ్.. అందుకే సైలెంట్ అయిపోయాడంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని.. లగచర్ల, హెచ్‌సీయూ(HCU), మూసీ(Musi) విషయంలో ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హెచ్‌సీయూలో జంతువుల వ్యధకు కారణమైన వారిపై కేసులు పెట్టాల్సిందే అని అన్నారు. ప్రభుత్వ సంస్థ జూపార్క్ నివేదికలోనే జింకలు, నెమళ్లు ఉన్నట్లు చెప్పాయని కేటీఆర్ గుర్తుచేశారు. గంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టులను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.
సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపిన కేసులో జైలుకు వెళ్లారు.. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఏళ్లు పూర్తయిన రెండో తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అని.. అందుకే వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అది బీఆర్ఎస్ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభ కాబోతోందని అన్నారు. ఈసారి డిజిటల్ మెంబర్ షిప్‌ను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా రాష్ట్రంలో నెలకో కార్యక్రమం నిర్వహిస్తామని కీలక ప్రకటన చేశారు. వరంగల్ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని అన్నారు. తెలంగాణపై ట్రంప్ సుంకాల ప్రభావం పడనుందని తెలిపారు.






